'యోగా దినచర్యలో భాగం కావాలి'
SKLM: యోగా దినచర్యలో భాగం కావాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం నగరంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. రేపు విశాఖపట్నంలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.