పేలిన ఫ్రిజ్.. ఇల్లు దగ్ధం

పేలిన ఫ్రిజ్.. ఇల్లు దగ్ధం

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో ఇవాళ ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న ఫ్రిజ్ అకస్మాత్తుగా పేలడంతో మంటలు వ్యాపించి ఇంటి సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. భారీ శబ్దంతో పేలుడు చోటుచేసుకోవడంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.