నేడు తిరుపతికి రానున్న రాష్ట్రపతి

నేడు తిరుపతికి  రానున్న రాష్ట్రపతి

TPT: నేడు తిరుపతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శించుకొనున్నారు. అనంతరం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి బస చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9.30 గంటలకు తిరుమలలో శ్రీ వరాహ స్వామిని రాష్ట్రపతి దర్శించుకుంటారు.