VIDEO: ప్రమాదకరంగా మారిన డీమార్ట్ రోడ్డు
SRPT :సూర్యాపేట పట్టణంలోని డీమార్ట్ రోడ్డులో అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ క్యాప్ డ్యామేజ్ కావడంతో ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. రెండు రోజుల క్రితమే ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మరణించిన నేపథ్యంలో, అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన క్యాప్‌లు వేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరో ప్రాణం పోకముందే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.