ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం

ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం

KDP: పులివెందుల స్థానిక YSVRM ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ఏప్రిల్ 1 నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఐసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తక్షణమే అడ్మిషన్లు పొందాలని సూచించారు.