'​ఆరోగ్యకర జీవనానికి సురక్షిత ఆహారమే కీలకం'

'​ఆరోగ్యకర జీవనానికి సురక్షిత ఆహారమే కీలకం'

SRPT: ప్రజలు సురక్షిత ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.వెంకటరమణ సూచించారు. సోమవారం సూర్యాపేటలో గాంధీ పార్కు వద్ద ఆహార భద్రతా ర్యాలీని ఆయన ప్రారంభించారు. వేసవిలో జంక్ ఫుడ్స్ మానేసి, పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలని కోరారు. హోటళ్లు, వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.