ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు

ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు

AKP: నర్సీపట్నం ఉత్తరవాహిని ప్రాంతం బుధవారం చిన్నారుల ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రిన్సిపల్ దేవరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో అందరినీ అబ్బురపరిచారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం కొరకు పిక్నిక్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు.