వీధి కుక్కల సమస్య నివారణకు కసరత్తు

వీధి కుక్కల సమస్య నివారణకు కసరత్తు

NLG: జిల్లాలో వీధి కుక్కల సమస్య నివారణకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయనున్నారు. పట్టణాలు, గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను పట్టుకెళ్లి ఎనిమల్ కేర్ సెంటర్‌లో శస్త్ర చికిత్సలతో పాటు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయనున్నారు. జిల్లాలో విధి కుక్కల నివారణకు అధికారుల ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.