VIDEO: మురికి నీటి నిల్వతో ప్రజలకు అవస్థలు
NLR: 'ఇంటి పన్నులు చెల్లించమని డిమాండ్లు చేస్తారు. చెల్లించడంలో ఆలస్యమైతే ఫైన్ వేస్తారు. ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోరా?' అని బుచ్చి పట్టణం సుబ్బారెడ్డి నగర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్లపైకి మురుగు నీరు చేరి చెరువును తలపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. పన్నులు వసూలు చేసే శ్రద్ధలో కొంతైనా సమస్యలు పరిష్కరించే దానిపై పెట్టాలని వారు అంటున్నారు.