వనదేవతల సన్నిధిలో మగబిడ్డ జననం

వనదేవతల సన్నిధిలో మగబిడ్డ జననం

MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో గురువారం ఓ గర్భిణికి సుఖప్రసవం జరిగింది. మేడ్చల్ జిల్లా మౌలాలి ప్రాంతానికి చెందిన రజితకు పురిటి నొప్పులు రావడంతో మేడారంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వరంగల్ సీకేఎం ఆసుపత్రి వైద్యులు రమ్య, నికిత సుఖప్రసవం చేయగా.. రజిత మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.