VIDEO: త్రాగునీటి సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో మండల పరిషత్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో త్రాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి గ్రామంలో 15 రోజులకు ఒక్కసారైనా క్లోరోస్కోప్‌తో పరీక్షల నిర్వహిస్తున్నామని తెలిపారు.