ఎమ్మెల్యేను కలిసిన స్వర్ణకారులు సంఘం నూతన సభ్యులు
ADB: ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను పట్టణ స్వర్ణకారుల సంఘం నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన సభ్యులను సన్మానించి, అభినందించారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు తిప్పర్తి సత్యం, ప్రధాన కార్యదర్శి అనుసూరి అనిల్, కోశాధికారి వెలిశాల సంతోష్, సంఘ సభ్యులు వేణు, సంజీవ్ పాల్గొన్నారు.