ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ సమీక్ష
WNP: ఓటర్ల జాబితా సవరణలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) నియామకం కీలకమని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల నుంచి BLAల జాబితాను త్వరగా సేకరించాలని సూచించారు. ఫారం 6, 7, 8 కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి, ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.