కల్లూరు డివిజన్‌లో ఎంత మంది ఓటర్లు అంటే..?
KMM: ఈ నెల 17న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కల్లూరు డివిజన్‌లో 2,44,280 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 1,18,900 పురుషులు, 1,25,380 మహిళలు ఉన్నారు. తల్లాడలో 42,384, సింగరేణిలో 41,795, పెనుబల్లిలో 40,523, వేంసూర్లో 35,531, కల్లూరులో 32,819, సత్తుపల్లిలో 32,477, ఎన్కూరులో 18,754 ఓటర్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు.