VIDEO: రాఖీ పండుగ వేళ దుకాణాల వద్ద సందడి

VIDEO: రాఖీ పండుగ వేళ దుకాణాల వద్ద సందడి

కృష్ణా: రాఖీ పండుగ వేళ ఉంగుటూరు మండలం తేలప్రోలు, పెద్ద అవుటపల్లి, ఆత్కూరు, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి సందడి నెలకొంది. రేపటి పండుగకు ముందుగా చెల్లెల్లు అన్నలకు కట్టేందుకు రాఖీలు, బహుమతులు కొనుగోలు చేస్తూ మార్కెట్లు కిక్కిరిసాయి. రంగురంగుల రాఖీలు, అలంకార వస్తువులతో దుకాణాలు వెలిగిపోగా, సోదర సోదరీమణుల అనుబంధం ఉత్సాహంగా కనువిందు చేసింది.