'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

AKP: పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాకవరపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇవాళ కార్మికులు నిరసన తెలిపారు. పంచాయతీ కార్మికులు ప్రతిరోజు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతారని, కానీ వారికి అన్ని సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.