తొర్రూరులో ఛైర్మన్ పీఠం కోసం ఉత్కంఠ
MHBD: తొర్రూరులో మున్సిపల్ ఛైర్మన్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ,ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పోటీ ఉత్కంఠగా మారింది. 16 వార్డుల్లో బీఆర్ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 స్థానాలు లభించాయి. ఎక్స్‌అఫీషియో ఓట్లతో సమీకరణాలు మారే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగి రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.