ట్రంప్ లొంగిపోవాలి: ఇరాన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ మరోసారి మండిపడింది. ట్రంప్ హెచ్చరికలకు భయపడేది లేదని స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా దాడులు కొనసాగుతాయని వెల్లడించింది. ట్రంప్ బాధ్యతారహిత బెదిరింపులు, ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ట్రంప్ లొంగిపోవాలని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సలహాదారు పేర్కొన్నారు.