వారసంత వల్ల ఇబ్బందులు పడుతున్నాం: గ్రామస్తులు

వారసంత వల్ల ఇబ్బందులు పడుతున్నాం: గ్రామస్తులు

సంగారెడ్డి: నారాయణఖేడ్ పట్టణంలో మంగళవారం సంత సందర్భంగా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సామాగ్రి కొనుగోలుకు పట్టణానికి వస్తున్నారు. ప్రధాన రహదారిపై ట్రాన్స్‌పోర్ట్ లారీలు నడిరోడ్డుపై నిలిపివేయడం వల్ల, జనాలకు మరియు ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ లారీలపై సమయపాలన విధిస్తే ఇబ్బందులు ఉండవని పట్టణవాసులు పోలీస్ అధికారులను కోరుతున్నారు.