ఐదురోజుల పాటు నీటిసరఫరా నిలిపివేత

ఐదురోజుల పాటు నీటిసరఫరా నిలిపివేత

KMR: మిషన్​ భగీరథ నుంచి తాగునీటి సరఫరాను ఐదురోజుల పాటు నిలిపివేస్తున్నట్లు మిషన్​ భగీరథ సబ్​డివిజన్​ అధికారులు ఆదివారం పేర్కొన్నారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు. జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లోని ఆవాసాలకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఐదురోజుల పాటు ఉండదని అధికారులు తెలిపారు.