ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ అని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. లక్కవరపుకోట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుండి మొత్తం 60కి పైగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు.