VIDEO: 'గాజాను తలపించే విధంగా వెలుగుమట్ల విధ్వంసం'
KMM: వెలుగుమట్లలో గాజాను తలపించేంత విధ్వంసం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు బుధవారం ప్రస్తావించారు. పేదలకు ఇళ్లను కట్టిస్తానన్న ప్రభుత్వమే ఇళ్లు నిర్ధాక్షణంగా కూల్చివేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి కూల్చిన చోటే పట్టాలు ఇస్తానని చెప్పారు. పేదలకు పక్కా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.