మంత్రి ఉత్తమ్ కుమార్ ఇలాకాలో బీఆర్ఎస్ గెలుపు
SRPT: మంత్రి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మేజర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జిల్లాలో అతిపెద్ద జిపిగా ఉన్న మేళ్లచెరువులో BRS బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బచ్చు పద్మావతి శ్రీనివాస్ రెడ్డి 800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 11 వార్డుల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు.