'ధాన్యం బస్తాలను తరలించాలి'

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలను అధికారులు గోదాములకు తరలించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండగొర్ల లింగన్న డిమాండ్ చేశారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని ఎండకు ఆరబోశారన్నారు.