రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు తీవ్ర గాయాలు

PLD: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామం భాగ్యనగర్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అన్నాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడ్డారు. నిండుచర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్ (27), పావని (23) బైక్‌పై వెళ్తుండగా ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.