VIDEO: కడప మున్సిపల్ ఆఫీస్‌లో ఏసీబీ దాడులు
KDP: నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ACB అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ACB CI నాగరాజు, సయ్యద్ హాసం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న పక్క సమాచారంతో ఈ ఆకస్మికంగా దాడులు చేపట్టినట్లు వెల్లడించారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.