దేవుపల్లిలో గడ్డివాములు దగ్ధం

దేవుపల్లిలో గడ్డివాములు దగ్ధం

VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లిలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో పడాల వెంకటరావుకు చెందిన ఆరు ట్రాక్టర్ల గడ్డివాములు కాలిపోయినట్లు గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్‌వి రవి ప్రసాద్ చెప్పారు. ఈ ప్రమాదంలో సుమారు 40 వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. అజాగ్రత్తగా పొగ తాగి పారివేయడం వల్ల ప్రమాదం సంభవించిందన్నారు.