మెదక్ పట్టణంలో 'EAT RIGHT WALK' ర్యాలీ
MDK: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక - 99 రోజుల కార్యక్రమాన్ని పురస్కరించుకుని మెదక్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుంచి 'EAT RIGHT WALK' కార్యక్రమం చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.