'అభివృద్ధికి మార్గదర్శి రాజీవ్ గాంధీ'

NRML: మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హయాంలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని ఖానాపూర్, కడెం మండలాల కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం వారు ఖానాపూర్, కడెం మండల కేంద్రాల్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1985లో ప్రధాని అయిన రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు.