ప్రారంభమైన మూలవాగు బ్రిడ్జి పనులు

SRCL: వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్దగల మూలవాగుపై మూడవ బ్రిడ్జి నిర్మాణ పనులు బుధవారం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం పట్టణ ప్రజలు, రాజన్న భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పనులు ప్రారంభం కావడంతో స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.