ఆలయ కళ్యాణ మండపం ప్రారంభించిన మంత్రి తుమ్మల
KMM: సత్తుపల్లి మండలం బేతుపల్లిలోని 5వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో వేంచేసియున్న శ్రీ పరమేశ్వరుడి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. బెటాలియన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.