పశువులకు వ్యాధి నిరోధక టీకాలు
KMR: గాంధారి మండలం మాతుసంగెం గ్రామంలో శుక్రవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువులకు చికిత్సలు చేసి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. పశువులు రోగాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎ గంగాధర్, గోపాలమిత్రలు రాములు, రమేశ్, ప్రసాద్ పాల్గొన్నారు.