పంచాయతీ ఎన్నికల్లో విభేదాలు సృష్టించవద్దు: ఎస్సై
SRCL: పంచాయతీ ఎన్నికల్లో విభేదాలు సృష్టించవద్దని ప్రలోభాలకు లొంగవద్దని చందుర్తి ఎస్సై రమేష్ అన్నారు. మండలంలోని ఆశీరెడ్డిపల్లి, ముడపల్లి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై బుధవారం అవగాహన కల్పించారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆదర్శ ప్రవర్తన నియమావళిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామస్తులకు, ఓటర్లకు నియమావళి గురించి సమగ్రంగా వివరించారు.