ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ
SKLM: పైడిభీమవరం పారిశ్రామిక వాడలో APIIC ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను సీఎం నారా చంద్రబాబు మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు , ఎంపీ అప్పలనాయుడు పాల్గొన్నారు. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కాంప్లెక్స్ ఎంతో తోడ్పడుతుందని ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు.