మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం?
NLR: నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి అవకాశాలు పెరుగుతున్నాయి. మేయర్ దంపతులు అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని 40 మంది కార్పొరేటర్లు మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంత్రి, ఎమ్మెల్యే కోటంరెడ్డి దీనికి మద్దతు తెలిపారు. సోమవారం కార్పొరేటర్లందరూ కలెక్టర్‌ను కలిసి నోటీసు ఇవ్వనున్నారు.