VIDEO: ఘనంగా శ్రీ సీతారామ ధ్వజస్తంభ ప్రతిష్ట వేడుకలు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పాతసంతబయలులో వెలసిన శ్రీ సీతారాముని ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ట వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. రేపు ఉదయం 8:38 నిమిషాలకు ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆలయ ఆవరణలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ హోమంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శేఖర్ గణేష్ హాజరయ్యారు. పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు.