కుక్కల దాడిలో 11 గొర్రెల మృతి

కుక్కల దాడిలో 11 గొర్రెల మృతి

KMR: బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామంలో బుధవారం వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేయగా 11 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన దర్ని నవీన్‌కు సంబంధించిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 11 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.