క్రాప్ బుకింగ్ను పరిశీలించిన డీఏవో భాగ్యలక్ష్మి
KNR: వీణవంక మండలం బొంతుపల్లిలో జరుగుతున్న క్రాప్ బుకింగ్ ప్రక్రియను జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి బుధవారం పరిశీలించారు. వరి, పత్తి, మొక్కజొన్న వంటి ఏ పంట వేసినా రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.