శిక్షణ పూర్తి చేసుకున్న జాగిలం 'యామి’
NRML: మొయినాబాద్‌లోని ఐఐటీఏలో 8 నెలల పాటు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న 'యామి' అనే పోలీసు జాగిలం నిర్మల్‌కు చేరుకుంది. గురువారం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో యామి ఉత్తీర్ణత సాధించిందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ జాగిలం జిల్లాలో ట్రాకింగ్ విభాగంలో విధులు నిర్వహించనుంది. నేర పరిశోధనలో యామి కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.