భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ పాక్ రేంజర్

భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ పాక్ రేంజర్

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ సరిహద్దు ద్వారా ఓ పాకిస్తాన్ రేంజర్ భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డాడు. అప్రమత్తంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం(BSF) జవాన్లు అతడిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడు ఎందుకు భారత భూభాగంలోకి చొరబడ్డాడనే విషయంపై BSF అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.