పిషిణిలో వాహనాలను అడ్డగించిన గ్రామస్తులు

SKLM: రణస్థలం మండలం పిషిణి గ్రామ పంచాయతీ పరిధిలోని కొన్ని కంపెనీలకు వెళ్లే భారీ వాహనాల రాకపోకలను గ్రామస్తులు అడ్డుకున్నారు. భారీ వాహనాల రాకపోకల వల్ల పిషిణి నుంచి చిల్లపేటరాజాం వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతలుపడి పూర్తిగా పాడైందన్నారు. ఈ విషయంపై కంపెనీల యాజమాన్యానికి ఎన్నో సార్లు చెప్పినా స్పందించట్లేదన్నారు. వాహనాలను అడ్డగించి నిరసన తెలిపారు.