VIDEO: 'అడవుల సంరక్షణ కోసం అమరుల త్యాగం వెలకట్టలేనిది'

KMM: అడవుల సంరక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరుల త్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం సత్తుపల్లి టింబర్ డిపోలో అమరవీరుల స్థూపం వద్ద విధి నిర్వహణలో భాగంగా అశువులు బాసిన అమరవీరులకు ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. మనమంతా అటవీ సంపద రక్షణలో భాగస్వాములవ్వాలని సూచించారు.