కృష్ణానదిలో గల్లంతైన అన్నదమ్ములు మృతి..!
SRPT: చింతలపాలెం మండలం చింత్రియాలలో విషాదం నెలకొంది. కృష్ణానదిలో గల్లంతైన ఇద్దరు సోదరులు మృతదేహాలుగా లభ్యమవ్వడంతో గ్రామమంతా కన్నీరుమున్నీరవుతోంది. కళ్లముందే బిడ్డలు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. నదీ తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.