VIDEO: స్కంద మాతగా బాసర అమ్మవారు
నిర్మల్: బాసరలో కన్నుల పండువగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సరస్వతి అమ్మవారు ఈరోజు స్కంద మాతగా భక్తులకు దర్శన మిస్తున్నరు. వేకువజామున చతుషష్టి ఉపచార పూజలు, మహా హారతి అనంతరం పెరుగు అన్నంను నైవేద్యంగా ఆలయ వైదిక బృందం అమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నరు.