కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి

NTR: విజయవాడలోని వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని మాజీ మంత్రి కొడాలి నాని, నాగపూర్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. అనంతరం వారికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.