హనుమాన్ ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్

హనుమాన్ ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్

HYD: శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా దూల్ పేటలోని ఆకాష్ పూరీ హనుమాన్ ఆలయానికి ఎమ్మెల్యే రాజా సింగ్ చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన భారీ శోభాయాత్రను ప్రారంభించనున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో దూల్‌పేట గల్లీలన్నీ మారుమోగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.