పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి
PLD: సీఎం సహాయనిది పేదల పాలిటి పెన్నిదని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 40 మంది లబ్ధిదారులకు, 26 లక్షలు 73 వేలు చెక్కులను శుక్రవారం తన కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.