ఈనెల 17న కాకినాడలో ఉద్యోగ మేళా

ఈనెల 17న కాకినాడలో ఉద్యోగ మేళా

కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఈనెల 17న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ కె. లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులైన 40 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని కోరారు.