VIDEO: న్యాయవాదుల పాదయాత్ర షురూ..!

VIDEO: న్యాయవాదుల పాదయాత్ర షురూ..!

GDWL: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభమైంది. న్యాయవాదుల బృందం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాల వద్ద పూజలు నిర్వహించి పాదయాత్రను మొదలుపెట్టింది. ఈ పాదయాత్ర నిరంతరాయంగా వారం రోజుల పాటు కొనసాగుతుందన్నారు.