హిరమండలంలో పోలీస్ బలగాలతో కార్డెన్ సెర్చ్

SKLM: హిరమండలంలో గురువారం సాయంత్రం పోలీస్ బలగాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్సై మహమ్మద్ యాసిన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఎటువంటి పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. అపరిచిత వ్యక్తులు తారసపడితే పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు చెప్పారు.